DK Aruna: డ్రగ్స్ కేసులో నోటీసులతో బీజేపీకి ఏంటి సంబంధం?: డీకే అరుణ

DK Aruna responds to criticism over notices in drugs case
  • డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు
  • డ్రగ్స్ కేసు కొత్తదేమీ కాదన్న డీకే అరుణ
  • తప్పుచేయకుంటే భయమెందుకని వ్యాఖ్యలు
డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ లకు ఈడీ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీపై వస్తున్న విమర్శలకు ఆ పార్టీ నేత డీకే అరుణ బదులిచ్చారు. డ్రగ్స్ కేసు కొత్తదేమీ కాదని, ఇప్పటికే వారిపై నడుస్తోందని, అందులో భాగంగానే నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. 

తప్పుచేయకుంటే భయమెందుకు... అనవసరంగా ఏమీ నోటీసులు ఇవ్వరు కదా? అని ఆమె వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసులో నోటీసులు వస్తే, దాన్ని బీజేపీకి ముడివేయడం సరికాదని హితవు పలికారు. ఆ నోటీసులకు బీజేపీకి ఏంటి సంబంధం? అని ప్రశ్నించారు. 

ఇక లిక్కర్ స్కాంపైనా డీకే అరుణ స్పందించారు. లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటికి వచ్చాకే ఫాంహౌస్ కేసు వచ్చిందని అన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలైతే ప్రగతిభవన్ లో ఎందుకు బంధించారు? అని నిలదీశారు.
DK Aruna
Drugs Case
Notice
Rohit Reddy
BJP
TRS
Telangana

More Telugu News