Rohit Reddy: అయ్యప్పమాలతో యాదాద్రికి వస్తా... తడిగుడ్డలతో బండి సంజయ్ రావాలి: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

Rohit Reddy challenges Bandi Sanjay
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు
  • బండి సంజయ్ కి ముందే ఎలా తెలుసన్న రోహిత్ రెడ్డి
  • డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు ఎప్పుడు వచ్చాయో చెప్పాలని సవాల్
బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నేతలకు, బీజేపీ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రోహిత్ రెడ్డి స్పందించారు. బీజేపీ కుట్రలు బయటపెట్టినందుకే తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈడీ నోటీసులు ఇచ్చినా భయపడబోనని, న్యాయవాదులతో మాట్లాడి నోటీసులకు తగిన సమాధానం ఇస్తానని వెల్లడించారు. 

బెంగళూరు డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు ఎప్పుడు వచ్చాయో బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రస్తుతం తాను అయ్యప్ప దీక్షలో ఉన్నానని, అయ్యప్పమాలతోనే యాదాద్రికి వస్తానని, బండి సంజయ్ తడిగుడ్డలతో వచ్చి ప్రమాణం చేయగలరా? అని రోహిత్ రెడ్డి సవాల్ చేశారు.

 అటు, ఈడీ నోటీసులపై బండి సంజయ్ కు ముందు ఎలా తెలుసో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, ఈ అంశంలో తాను కోర్టుకు వెళతానని స్పష్టం చేశారు.
Rohit Reddy
Bandi Sanjay
Notice
ED
TRS
BJP

More Telugu News