BMW: భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కు సిద్ధమవుతున్న బీఎండబ్ల్యూ
- విడుదలకు ముందు సామర్థ్య పరీక్షలు
- 2021లోనే ఈ స్కూటర్ ఇతర మార్కెట్లో విడుదల
- గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం
లగ్జరీ వాహనాలకు ప్రసిద్ధి చెందిన బీఎండబ్ల్యూ వచ్చే ఏడాది భారత మార్కెట్లో సీఈ 04 పేరుతో ఓ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఆసియా ప్రాంత హెడ్ మార్కస్ ముల్లర్ తెలిపారు. ఈ స్కూటర్ 2021లో ప్రపంచ మార్కెట్లో విడుదల కావడం గమనార్హం.
భారతీయ వాతావరణ పరిస్థితుల మధ్య సీఈ 04 స్కూటర్ సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్టు ముల్లర్ తెలిపారు. లిక్విడ్ కూల్ సింక్రోనస్ మోటార్ ఈ వాహనం ప్రత్యేకత. దీనివల్ల బ్యాటరీ వేడెక్కదు. ప్రమాదాలకు అవకాశం ఉండదు. 42 హెచ్ పీ పవర్ తో, పీక్ టార్క్ 62 ఎన్ఎంగా ఉంటుంది. 8.9 కిలోవాట్ అవర్ మోటార్ ఉంటుంది. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. స్కూటర్ బాడీ కూడా చాలా పొడవుగా ఉంటుంది.