China: చైనాకు తిరిగెళ్లేది లేదు.. భారత్ అత్యుత్తమ ప్రదేశం: దలైలామా

No point in return to China prefer India best place says Dalai Lama

  • కంగ్రాయే నా శాశ్వత నివాసమని ప్రకటన
  • చైనా సౌకర్యవంతంగా మారుతోందన్న దలైలామా
  • అయినా కానీ తాను తిరిగి వెళ్లబోనని స్పష్టీకరణ

బౌద్ధ గురువు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దలైలామా భారత్ ను అత్యుత్తమ ప్రదేశంగా అభివర్ణించారు. శాశ్వత నివాస హోదాతో హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రాలో దలైలామా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. టిబెట్ కు చెందిన 14వ దలైలామాగా (మత గురువు) ఆయనకు గుర్తింపు ఉంది. చైనా ఆంక్షలతో 1959 నుంచి భారత్ లోనే ఉంటున్నారు. 

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వద్ద నియంత్రణ రేఖ సమీపంలో ఇటీవలే భారత్, చైనా దళాలు ఘర్షణ పడడం తెలిసిందే. దీనిపై మీడియా ప్రతినిధులు దలైలామా వద్ద ప్రస్తావించారు. ‘‘యూరప్, ఆఫ్రికా, ఆసియాలో పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. చైనా కూడా సౌకర్యవంతంగా మారుతోంది. అయినా కానీ, చైనాకు నేను తిరిగి వెళ్లేది లేదు. నా ప్రాధాన్యం భారత్ కే. ఇదే ఉత్తమ ప్రదేశం. కంగ్రా పండిట్ నెహ్రూ ఎంపిక చేసిన ప్రదేశం. ఇదే నా శాశ్వత నివాసం’’ అని దలైలామా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News