CM Jagan: రాష్ట్రంలో ఎక్కడా డ్రగ్స్ వినియోగం ఉండకూడదు: సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan reviews SEB and Excise dept
  • ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖలపై సీఎం జగన్ సమీక్ష
  • రాష్ట్రాన్ని నార్కోటిక్స్ రహితంగా మార్చాలని నిర్దేశం
  • పోలీసు, ఎక్సైజ్, ఎస్ఈబీ సమన్వయంతో పనిచేయాలని సూచన
స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), ఎక్సైజ్ శాఖలపై సీఎం జగన్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చాలని నిర్దేశించారు. ఏపీలో ఎక్కడా డ్రగ్స్ వినియోగం ఉండకూడదని స్పష్టం చేశారు. అక్రమ మద్యం అరికట్టాలని, గంజాయి సాగు జరగకూడదని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం పోలీసు, ఎక్సైజ్, ఎస్ఈబీ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. 

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, మాదకద్రవ్యాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్ఈబీ టోల్ ఫ్రీ నెంబరును బాగా ప్రచారం చేయాలని, ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఇక, దిశ యాప్ ను మరింతగా వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు.
CM Jagan
SEB
Excise Dept
YSRCP
Andhra Pradesh

More Telugu News