Telangana: తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
- మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు
- 100 శాతం సిలబస్ తో పరీక్షల నిర్వహణ
- ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్స్
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలయింది. మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్ షెడ్యూల్ ను టీఎస్ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మార్చి 15న ప్రారంభమయ్యే ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చి 29తో ముగియనున్నాయి. మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బ్రిడ్జి వంటి పరీక్షలు ఏప్రిల్ 4న ముగుస్తాయి.
ఈసారి పరీక్షలను 100 శాతం సిలబస్ తో నిర్వహిస్తారు. కరోనా సమయంలో ఛాయిస్ ప్రశ్నలను పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జరగబోయే పరీక్షల్లో ఛాయిస్ ప్రశ్నల సంఖ్యను పూర్వ స్థితికి తీసుకొచ్చారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు జరుగుతాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూల్:
- సెకండ్ లాంగ్వేజ్ - మార్చి 15
- ఇంగ్లిష్ - మార్చి 17
- మ్యాథ్స్ ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్ - మార్చి 20
- మ్యాథ్స్ బీ / జువాలజీ / హిస్టరీ - మార్చి 23
- ఫిజిక్స్ / ఎకనామిక్స్ - మార్చి 25
- కెమిస్ట్రీ / కామర్స్ - మార్చి 28
- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ - మార్చి 31
- మోడ్రన్ లాంగ్వేజ్ / జాగ్రఫీ - ఏప్రిల్ 3
ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షెడ్యూల్:
- సెకండ్ లాంగ్వేజ్ - మార్చి 16
- ఇంగ్లిష్ - మార్చి 18
- మ్యాథ్స్ ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్ - మార్చి 21
- మ్యాథ్స్ బీ / జువాలజీ / హిస్టరీ - మార్చి 24
- ఫిజిక్స్ / ఎకనామిక్స్ - మార్చి 27
- కెమిస్ట్రీ / కామర్స్ - మార్చి 29
- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ - ఏప్రిల్ 1
- మోడ్రన్ లాంగ్వేజ్ / జాగ్రఫీ - ఏప్రిల్ 4