Macbook Pro: మ్యాక్ బుక్ ఆర్డర్ చేస్తే.. కుక్క ఫుడ్ వచ్చింది!

Man orders Macbook Pro worth Rs 120000 gets dog food instead

  • బ్రిటన్ వాసికి ఎదురైన వింత అనుభవం
  • మ్యాక్ బుక్ ప్రో కు బదులు పెడిగ్రీ డాగ్ ఫుడ్ పంపిన సెల్లర్
  • అమెజాన్ కు ఎన్ని కాల్స్ చేసినా  ఫలితం సున్నా

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన తర్వాత.. అది ఎప్పుడు డెలివరీ అవుతుందా? అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటాం. ఇలానే ఓ వ్యక్తి తనకు ఇష్టమైన యాపిల్ మ్యాక్ బుక్ ప్రో కోసం ఆన్ లైన్ లో ఆర్డర్ చేయగా, డెలివరీ తర్వాత అతడికి స్పృహ తప్పినంత పనైంది. ఎందుకంటే వచ్చింది ల్యాప్ టాప్ కాదు. కుక్క ఫుడ్. రూ.1.20 లక్షల విలువైన ల్యాప్ టాప్ ఆర్డర్ చేస్తే వందల రూపాయల విలువ చేసే కుక్క ఫుడ్ (పెడిగ్రీ డాగ్ ఫుడ్) పంపించడం అంటే.. కస్టమర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఈ అనుభవం బ్రిటన్ లోని డెర్బిషైర్ కు చెందిన అలన్ వుడ్ కి ఎదురైంది. అతడు తన కుమార్తె కోసం 1,200 పౌండ్లతో (రూ.1.2 లక్షలు) మ్యాక్ బుక్ ప్రో కోసం అమెజాన్ లో ఆర్డర్ పెట్టడం గమనార్హం. ఇలాంటివి ఘటనలు లోగడ కూడా కొన్ని వెలుగు చూశాయి. ఆ మధ్య మన దేశంలోనూ ఓ వ్యక్తి యాపిల్ ఐఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ చేయగా, డిటర్జెంట్ బార్ డెలివరీ అయింది. అలన్ వుడ్ అమెజాన్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి విషయం చెప్పగా, తామేమీ చేయలేమని అవతలి నుంచి సమాధానం రావడంతో అతడు మరింత తెల్లబోయాడు. 

15 గంటల పాటు అమెజాన్ కు ఎన్నో సార్లు కాల్ చేసి, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ లు, మేనేజర్లతో మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదు. రెండు దశాబ్దాలుగా అమెజాన్ కు కస్టమర్ గా ఉన్న తనకు ఇలాంటి అనుభవం ఇదే మొదటిసారి అని చెప్పిన అలన్ వుడ్, ఇక మీదట అమెజాన్ లో ఆర్డర్ చేయకుండా ఉండడమే తన ముందున్న పరిష్కారమని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News