Vijayasai Reddy: రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్లుగా విజయసాయిరెడ్డి, పీటీ ఉష

Vijayasai Reddy and PT Usha appointed as Rajya Sabha panel vice chairmen
  • 10 రోజుల క్రితమే ప్యానల్ వైస్ ఛైర్మన్ గా విజయసాయి నియామకం
  • కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన పేరు తొలగింపు
  • ఇప్పడు మళ్లీ ఆయనను నియమిస్తూ రాజ్యసభ ఛైర్మన్ ప్రకటన
రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. వాస్తవానికి 10 రోజుల క్రితమే విజయసాయిని ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించారు. అయితే, ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ఆయన పేరును తొలగించారు. ఇప్పుడు మళ్లీ ఆయనను ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించారు. ఈ మేరకు భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. పరుగుల రాణి పీటీ ఉషను కూడా ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంగా ఇద్దరికీ జగదీప్ ధన్కర్ అభినందనలు తెలిపారు. ప్యానెల్ వైస్ ఛైర్మన్ గా ఒక నామినేటెడ్ ఎంపీ (పీటీ ఉష) నియామకం కావడం గమనార్హం.
Vijayasai Reddy
YSRCP
PT Usha
Rajya Sabha
Panel Vice Chairmen

More Telugu News