Rohit Sharma: రెండో టెస్టుకు కూడా రోహిత్ శర్మ దూరం.. టీమిండియా జట్టు ఇదే!

Rohit Sharma ruled out for secon test
  • బంగ్లాదేశ్ తో రెండో వన్డేలో గాయపడిన రోహిత్
  • గాయం ఇంకా నయం కాలేదని తెలిపిన బీసీసీఐ
  • నవ్ దీప్ షైనీ కూడా రెండో టెస్టుకు దూరం
బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టుకు కూడా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. రెండో టెస్టులో కూడా రోహిత్ శర్మ ఆడబోవడం లేదని బీసీసీఐ ప్రకటించింది. గాయం నుంచి రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదని తెలిపింది. గాయం పూర్తిగా నయం కావడానికి మరింత సమయం పడుతుందని మెడికల్ టీమ్ తెలిపిందని వెల్లడించింది. ఈ కారణం వల్ల రోహిత్ బంగ్లాదేశ్ తో జరగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండడని తెలిపింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ గాయపడిన సంగతి తెలిసిందే. మరోవైపు పొత్తి కడుపు కండరాల నొప్పితో బాధపడుతున్న నవ్ దీప్ షైనీ కూడా రెండో టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టుకు ఆడబోయే జట్టును బీసీసీఐ ప్రకటించింది.

బంగ్లాదేశ్ తో రెండో టెస్టుకు టీమిండియా స్క్వాడ్ ఇదే:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, చటేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయశ్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.
Rohit Sharma
Team India
Bangladesh
Second Test
Squad

More Telugu News