Padmaja Raju: సీనియర్ నటుడు హరనాథ్ కుమార్తె కన్నుమూత

Senior producer Haranath daughter Padmaja Raju dies of heart attack
  • గుండెపోటుతో పద్మజా రాజు మృతి
  • పద్మజా రాజు నిర్మాత జీవీజీ రాజు అర్ధాంగి
  • తండ్రిపై ఇటీవలే 'అందాల నటుడు' పుస్తకం తెచ్చిన పద్మజ  
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సీనియర్ నటుడు హరనాథ్ కుమార్తె, నిర్మాత జీవీజీ రాజు భార్య పద్మజా రాజు కన్నుమూశారు. 54 ఏళ్ల పద్మజా రాజు ఈ మధ్యాహ్నం గుండెపోటుకు గురయ్యారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

ఇటీవల పద్మజా రాజు తన తండ్రి హరనాథ్ జీవితంపై 'అందాల నటుడు' అనే పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ చేతులమీదుగా ఆవిష్కరించారు. పద్మజా రాజు భర్త జీవీజీ రాజు పవన్ కల్యాణ్ తో గోకులంలో సీత, తొలిప్రేమ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. గోదావరి చిత్రం కూడా జీవీజీ రాజు నిర్మాణంలోనే తెరకెక్కింది.
Padmaja Raju
Heart Attack
Demise
GVG Raju
Haranath
Tollywood

More Telugu News