Team India: రాణించిన టీమిండియా బౌలర్లు... కష్టాల్లో బంగ్లాదేశ్

Bangladesh in troubles after Team India bowlers scalps six wickets
  • ఢాకాలో టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు
  • తలో రెండు వికెట్లు తీసిన ఉమేశ్, ఉనద్కట్, అశ్విన్
ఢాకాలో నేడు టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆటలో మూడో సెషన్ సమయానికి బంగ్లా 67 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగులు చేసింది. 

ఓ దశలో 172 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును మోమినుల్ హక్ (81 బ్యాటింగ్), మెహిదీ హసన్ (15) ఆదుకున్నారు. అయితే ఉమేశ్ యాదవ్... మెహిదీ హసన్ ను అవుట్ చేయడంతో ఈ జోడీకి తెరపడింది. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 2, జయదేవ్ ఉనద్కట్ 2, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం క్రీజులో మోమినుల్ హక్, నురుల్ హసన్ ఉన్నారు.
Team India
Bangladesh
2nd Test
Dhaka

More Telugu News