Harish Rao: జీతాలు ఆలస్యం కావడానికి కారణం ఇదే: హరీశ్ రావు

Harish Rao response on teachers salaries

  • కేంద్రం వల్లే జీతాలు ఆలస్యమవుతున్నాయన్న మంత్రి 
  • సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ 
  • దేశంలో ఎక్కువ వేతనాలు అందుకుంటున్నది తెలంగాణ ఉపాధ్యాయులేనని వెల్లడి 

తెలంగాణలో టీచర్ల జీతాల చెల్లింపులో ఆలస్యం కావడంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఆపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్లే జీతాల చెల్లింపులో ఆలస్యం అవుతోందని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని అన్నారు. ఉద్యోగుల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. విద్యాశాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. 

రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని మంత్రి విమర్శించారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతోందని అన్నారు. 15వ ఆర్థిక సంఘం చెప్పిన రూ. 5 వేల కోట్లను కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని చెప్పారు. దేశంలోనే ఎక్కువ వేతనాలు అందుకుంటున్నది తెలంగాణ ఉపాధ్యాయులని... వారి జీతాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హరీశ్ రావు అన్నారు.

  • Loading...

More Telugu News