chalapathirao: రవి బాబుకు కాల్ చేసి భావోద్వేగానికి గురైన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో

junior NTR called to Ravi babu vedio chalapathirao
  • లే బాబాయ్ లే అంటూ పిలిచిన తారక్
  • అకాల మరణం ఎంతగానో కలచివేసిందని ట్వీట్
  • ఆయన మరణం తమకు తీరని లోటు అంటూ ఆవేదన
తెలుగు సినీ పరిశ్రమలో చలపతిరావు అంటే అందరికీ అభిమానమే. ఆయన పలకరింపు, మాట పెద్దరికంతో, ఆత్మీయంగా ఉంటుంది. చలపతిరావుతో జూనియర్ ఎన్టీఆర్ కు సైతం మంచి అనుబంధం ఉంది. దీంతో చలపతిరావు మరణవార్త జూనియర్ ఎన్టీఆర్ ను తీవ్రంగా కలచివేసింది. అమెరికాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ చలపతిరావు కుమారుడు రవి బాబుకు వీడియో కాల్ చేసి తన తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు. ఈ వీడియోను ధనుష్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియో కాల్ లో ‘లే బాబాయ్ లే’’ అని చలపతిరావును పిలుస్తూ తారక్ భావోద్వేగానికి లోనయ్యారు. 

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలోనూ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు. ‘‘చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన’’ అని తారక్ ట్వీట్ చేశాడు.
chalapathirao
demise
junior NTR
called
ravi babu

More Telugu News