Infinix Zero Ultra: 12 నిమిషాల్లోనే పూర్తి చార్జింగ్.. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా అమ్మకాలు నేటి నుంచే..

Infinix Zero Ultra with 200 megapixel camera 180W fast charging to go on sale
  • 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ
  • ధర రూ.29,999
  • బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ కార్డులపై రూ.3,000 వరకు తగ్గింపు
  • ఫ్లిప్ కార్ట్ పై అమ్మకాలు
ఇన్ఫినిక్స్ ఫ్లాగ్ షిప్ ఫోన్ ‘ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా’ అమ్మకాలు ఆదివారం మొదలయ్యాయి. ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్ ను ఇన్ఫినిక్స్ ఈ నెల 20న విడుదల చేయడం గమనార్హం. ఆరంభ స్థాయి, మధ్య స్థాయి ఫోన్ విభాగాల్లోని యూజర్లను ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ తో లక్ష్యం చేసుకోనుంది. నిజానికి ఇది ప్రీమియం ఫోన్.  

6.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ, 3డీ కర్వ్ డ్ అమోలెడ్ డిస్ ప్లే సహా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ చిప్ సెట్ తో వస్తుంది. 13జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ఆప్షన్ తో వచ్చే దీని ధర రూ.29,999. వెనుక 200 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 180 వాట్ ఫాస్ట్ చార్జర్ తో కేవలం 12 నిమిషాల్లోనే పూర్తి చార్జ్ చేసుకోవచ్చు. 

బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుపై గరిష్టంగా రూ.2,000, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.3,000 వరకు తగ్గింపు పొందొచ్చు. జెనెసిస్ నాయిర్, కాజ్ లైట్ సిల్వర్ రంగుల్లో లభిస్తోంది.
Infinix Zero Ultra
200 megapixel camera
180W fast charger
12 minutes

More Telugu News