Rohit Reddy: నన్ను లొంగదీసుకునేందుకు ఈడీతో విచారణ చేయిస్తున్నారు: రోహిత్ రెడ్డి

rohit reddy
  • తొలి రోజు నన్ను ఆరు గంటల పాటు విచారించారు
  • రెండో రోజు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గురించి ప్రశ్నించారు
  • నందకుమార్ ద్వారా పెద్ద ప్లాన్ వేశారని విమర్శ
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు మీడియాతో రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, తనను లొంగదీసుకునేందుకే ఈడీతో బీజేపీ విచారణ జరిపిస్తోందని చెప్పారు. తొలిరోజు తనను ఆరు గంటల పాటు విచారించారని... ఏ కేసులో ప్రశ్నిస్తున్నారో కూడా చెప్పలేదని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గురించి రెండో రోజు ప్రశ్నించారని చెప్పారు. 

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదు చేసిన తనను విచారిస్తున్నారని... నిందితులను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడైన నంద కుమార్ ద్వారా పెద్ద ప్లాన్ వేశారని... ఆయన ద్వారా స్టేట్ మెంట్ తారుమారు చేయబోతున్నారని చెప్పారు. ఈడీ, ఐటీ, సీబీఐలతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు.
Rohit Reddy
TRS
BRS
Enforcement Directorate

More Telugu News