R Krishnaiah: అగ్రవర్ణాలు బీసీలను అణచివేశాయి.. బీసీలు అధికారాన్ని చేపట్టాల్సిన సమయం ఆసన్నమయింది: ఆర్.కృష్ణయ్య

The time has come for BCs to take over power says R Krishnaiah

  • బీసీలకు ఏ రంగంలోనూ ప్రాతినిధ్యం లభించడం లేదన్న కృష్ణయ్య
  • చట్ట సభల్లో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం కూడా దాటలేదని ఆవేదన
  • కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని డిమాండ్

దామాషా ప్రకారం బీసీలకు ఏ రంగంలోనూ ప్రాతినిధ్యం లభించడం లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలందరూ ఏకమై రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని చెప్పారు. అగ్రవర్ణాలు బీసీలను అణగదొక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు అధికారాన్ని చేపట్టడానికి ఇప్పుడు సమయం ఆసన్నమయిందని చెప్పారు.

 గత 75 ఏళ్లలో చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని అన్నారు. పార్లమెంటులో 16 రాష్ట్రాల నుంచి బీసీలకు ప్రాతినిధ్యం లేదని చెప్పారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు రాజ్యాంగ హక్కులు కాలరాయబడ్డాయని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెలల్లో కేవం 21 మంది మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పారు. కరెన్సీ నోట్లపై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News