Jagan: మంత్రి ఆదిమూలపు సురేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్

CM Jagan pays homage to Adimulapu Suresh mother
  • మంత్రి ఆదిమూలపు సురేశ్ కు మాతృవియోగం
  • అనారోగ్యంతో థెరీసమ్మ కన్నుమూత
  • నిన్న ప్రకాశం జిల్లాలో అంత్యక్రియలు
  • నేడు ఎర్రగొండపాలెం విచ్చేసిన సీఎం జగన్
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కు ఇటీవల మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆదిమూలపు సురేశ్ తల్లి థెరీసమ్మ (85) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు నిన్న జరిగాయి. 

ఈ నేపథ్యంలో, సీఎం జగన్ నేడు ప్రకాశం జల్లా ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ నివాసానికి వెళ్లారు. థెరీసమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మృతితో విచారంలో ఉన్న ఆదిమూలపు సురేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.
Jagan
Adimulapu Suresh
Mother
Demise
YSRCP
Andhra Pradesh

More Telugu News