Rahul Gandhi: భద్రతా నియమాలను రాహుల్ 113 సార్లు ఉల్లంఘించారు: సీఆర్ పీఎఫ్

Rahul Gandhi violated security guidelines 113 times since 2020
  • తమ సెక్యూరిటీ ఏర్పాట్లలో లోపంలేదని వెల్లడి
  • జోడో యాత్రలో రాహుల్ గాంధీకి సెక్యూరిటీ పెంచాలన్న కాంగ్రెస్
  • కేంద్ర హోంమంత్రికి ఆ పార్టీ రాసిన లేఖకు సీఆర్ పీఎఫ్ వివరణ
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సీఆర్ పీఎఫ్ గురువారం స్పందించింది. సెక్యూరిటీ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంలేదని, రాహుల్ గాంధీ భద్రతా మార్గదర్శకాలను తరచూ ఉల్లంఘిస్తారని పేర్కొంది. 2020 నుంచి ఇప్పటి వరకు 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను రాహుల్ అతిక్రమించారని, ఈ విషయాన్ని ఆయనకు కూడా తెలియజేసినట్లు వివరించింది.

జోడో యాత్ర ఢిల్లీలో ప్రవేశించిన తర్వాత జనం రద్దీ పెరిగిందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. జనం రాహుల్ గాంధీకి అతి సమీపంలోకి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి రక్షణ కల్పించాల్సి వచ్చిందని వెల్లడించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తూ.. రాహుల్ కు సెక్యూరిటీ మరింత పెంచాలని హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఈ లేఖపై సీఆర్ పీఎఫ్ స్పందించి, సెక్యూరిటీ వివరాలతో వివరణ ఇచ్చింది.
Rahul Gandhi
Congress
rahul security
crpf

More Telugu News