Tollywood: 'ఏం మాయ చేశావే'కి సీక్వెల్.. హీరోయిన్ గా రష్మిక?

Sequel for Em Maya Chesave Rashmika to be replaced samantha
  • 2010లో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం
  • యువతను ఆకట్టుకున్న చైతన్య, సమంత కెమిస్ట్రీ  
  • రెండో పార్టులోనూ హీరోగా నటించనున్న నాగచైతన్య!
నాగచైతన్య, సమంత జంటగా వచ్చిన ఏం మాయ చేశావే సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాతోనే సమంత టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. నాగచైతన్య కెరీర్ టేకాఫ్ కు ఈ చిత్రం సక్సెస్ కీలకంగా మారింది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతన్య, సమంత కెమిస్ట్రీ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాతో మొదలైన చై, సామ్ స్నేహం తర్వాత ప్రేమగా మారింది. కొన్నేళ్ల ప్రేమ తర్వాత ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

కానీ, ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగలేక ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి కెరీర్ లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా, ఏం మాయ చేశావే వచ్చిన 12 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ తీస్తారన్న ప్రచారం జరుగుతోంది. చిత్ర బృందం ఇప్పటికే స్ర్కిప్టు పనుల్లో నిమగ్నమై ఉందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. రెండో పార్టులో నాగచైతన్య హీరోగా నటిస్తాడని, హీరోయిన్ సమంత స్థానంలో రష్మిక మందన్న వస్తుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Tollywood
Naga Chaitanya
Samantha
em maya chesave
sequel
Rashmika Mandanna

More Telugu News