Raviteja: రవితేజ లేకపోతే నేను లేను: 'ధమాకా' మాస్ మీట్ లో హరీశ్ శంకర్
- 'ధమాకా' మాస్ మీట్ లో హరీశ్ శంకర్
- ఆయన వల్లనే తాను ఎదిగానని వ్యాఖ్య
- అది రవితేజ గొప్పతనమంటూ ప్రశంసలు
- సంక్రాంతి వరకూ సెలబ్రేషన్స్ అంటూ హర్షం
రవితేజ హీరోగా రూపొందిన 'ధమాకా' .. ఈ నెల 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, మాస్ హిట్ గా మంచి మార్కులు కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీమ్ 'మాస్ మీట్'ని నిర్వహించింది. ఈ వేదికపై హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. 'రవితేజను మాస్ మహారాజ్ అని ముందుగా పిలిచింది నేనే. దానిని మీరంతా కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది" అన్నాడు.
"ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉండటానికి రవితేజనే కారణం. ఆయన లేకపోతే నేను లేను. ఆయన లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ల లిస్ట్ లో నాతో పాటు చాలామంది ఉన్నారు. ఎదుటివారిలోని టాలెంటును గుర్తించడం .. ఎంకరేజ్ చేయడం ఆయన ప్రత్యేకత. నా సినిమా ఒకటి ఆగిపోయిందని తెలిసి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చినవాడాయన. ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోను" అని చెప్పాడు.
రవితేజ కష్టాలు పడటం వలన ఈ స్థాయికి రాలేదు .. కష్టపడటం వలన వచ్చాడు. ఈ సినిమా సెలబ్రేషన్స్ ఈ రోజుతో పూర్తికావడం లేదు. సంక్రాంతి వరకూ ఈ సినిమా సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి" అంటూ చెప్పుకొచ్చాడు.