Rahul Gandhi: ప్రధానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన రాహుల్ గాంధీ

My deepest condolences and love Rahul Gandhi tweets on Heeraba demise
  • హీరాబెన్ మరణం ఎంతో బాధాకరమన్న రాహుల్
  • ఈ కష్టకాలంలో ప్రధానికి తన సానుభూతి, ప్రేమ తెలియజేస్తున్నానని ట్వీట్
  • ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే సైతం సానుభూతి వ్యక్తీకరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ నిండు నూరేళ్ల జీవితం తర్వాత శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ప్రధాని మాతృమూర్తి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయి విచారంతో ఉన్న ప్రధాని మోదీకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మరణించిన వార్త నిజంగా ఎంతో బాధ కలిగిస్తోంది. ఈ కష్ట కాలంలో ప్రధాని మోదీ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, ప్రేమను తెలియజేస్తున్నాను’' అని రాహుల్ పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ సైతం ట్విట్టర్ లో సంతాపం తెలియజేశారు. హీరాబెన్ అంత్యక్రియలు నేటి ఉదయం గుజరాత్ లోని గాంధీ నగర్ లో పూర్తయ్యాయి. 

‘‘శ్రీమతి హీరాబెన్ మోదీ మరణ వార్త చాలా బాధ కలిగించింది. తాను ఎంతో ప్రేమించే అమ్మను కోల్పోయిన శ్రీ నరేంద్రమోదీజీకి నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలు మొత్తం వారి కుటుంబంతోనే ఉంటాయి’’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
Rahul Gandhi
deepest condolences
Heeraba demise
Prime Minister
Narendra Modi

More Telugu News