Cristiano Ronaldo: రొనాల్డోనా మజాకా.. ఒక్క డీల్ తో రూ. 4400 కోట్లు సొంతం

Cristiano Ronaldo Signs For Saudi Arabian Club Al Nassr In Deal Worth More Than 200m Euros

  • సౌదీ అరేబియా క్లబ్ అల్ నాసర్ కు ఆడేందుకు రొనాల్డో ఒప్పందం
  • మూడేళ్ల పాటు క్లబ్ కు ఆడేందుకు సంతకం చేసిన సాకర్ దిగ్గజం
  • గతంలో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కు ఆడిన రొనాల్డో

పోర్చుగల్ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఒక్క డీల్ తో ఏకంగా 4400 కోట్ల రూపాయలు సంపాదించాడు. ప్రఖ్యాత ఫుట్ బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ తో ఇటీవల తన బంధాన్ని తెంచుకున్న రొనాల్డో.. ఇప్పుడు సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని క్లబ్ అధికారికంగా ప్రకటించింది. ఏడాదికి 200 మిలియన్ యూరోల (రూ. 1700 కోట్ల పైనే) కంటే ఎక్కువ విలువైన ఒప్పందం ఇది. 37 ఏళ్ల రొనాల్డో జూన్ 2025 వరకు మొత్తంగా 500 మిలియన్ యూరోలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. మూడేళ్లకు గాను రొనాల్డో  భారత కరెన్సీలో అతను ఏకంగా 4400 కోట్ల పైచిలుకు మొత్తం అందుకుంటాడు. 

రొనాల్డో గతంలో ప్రముఖ క్లబ్స్ అయిన మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, యువెంటస్ జట్లకు పోటీ పడ్డాడు. అల్ నాసర్ తో కలిసి ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని రొనాల్డో పేర్కొన్నాడు. అల్ నాసర్ తొమ్మిది సార్లు సౌదీ అరేబియా లీగ్ టైటిళ్లను గెలుచుకుంది. అయితే, రొనాల్డో లాంటి సూపర్ స్టార్లు ఎక్కువగా యూరప్ క్లబ్స్ కే ఆడేందుకు ఇష్టపడతారు. తొలిసారి ఈ తరంలోనే మేటి ఆటగాడు సౌదీ గడ్డపై జరిగే లీగ్ లో పోటీ పడటం చారిత్రక సందర్భం కాబోతోంది. కాగా, ఖతార్ వేదికగా ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచ కప్ లో క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లో ఓడి నిరాశ పరిచింది. రొనాల్డో కెరీర్ లో ఇది చివరి ప్రపంచ కప్ కానుంది.

  • Loading...

More Telugu News