Mark Zuckerberg: మూడోసారి తండ్రి కాబోతున్న మార్క్ జుకర్‌బర్గ్

Mark Zuckerberg shares pic with pregnant wife Priscilla Chan on New Year Day
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన జుకర్‌‌బర్గ్
  • ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు
  • డేటింగ్ తర్వాత 2012లో వివాహం చేసుకున్న జుకర్‌బర్గ్-ప్రిస్కిల్లా
కొత్త సంవత్సరం తొలి రోజున ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఓ సంతోషకరమైన వార్తను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి ఈ ఏడాది తమ జీవితంలోకి రాబోతున్నట్టు పేర్కొన్నారు. భార్య ప్రిస్కిలా చాన్‌తో ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో ప్రిస్కిల్లా బేబీబంప్‌తో కనిపించారు.

మార్క్ జుకర్‌బర్గ్, ప్రిస్కిల్లా చాన్ ఇద్దరూ కాలేజీ మేట్స్. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2003 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. అనంతరం 19 మే 2012లో వివాహం చేసుకున్నారు. 2015లో మాక్సిమా చాన్ అనే అమ్మాయికి జన్మనిచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 2017లో మరో పాప ‘ఆగస్ట్’ జన్మించింది. ఇప్పుడు మరో చిన్నారికి జుకర్ బర్గ్ దంపతులు జన్మనివ్వబోతున్నారు.
Mark Zuckerberg
Facebook
Priscilla Chan

More Telugu News