Notes Ban: నోట్ల రద్దు నిర్ణయం తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- లక్ష్యం నెరివేరిందా? లేదా? అన్నది అప్రస్తుతమున్న కోర్టు
- ప్రభుత్వం ప్రతిపాదించిందని కొట్టివేయలేమని స్పష్టీకరణ
- ఆర్ బీఐ, కేంద్రం వాదనలతో ఏకీభవించిన మెజారిటీ ధర్మాసనం
కేంద్రంలోని మోదీ సర్కారు 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించగా.. తీర్పు సందర్భంగా ధర్మాసనం చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలను పరిశీలిస్తే..
ధర్మాసనం వ్యాఖ్యలు
- డీమోనిటైజేషన్ లక్ష్యం నెరవేరిందా? లేదా? అన్నది అసందర్భం.
- ప్రభుత్వం సాధించాలనుకున్న లక్ష్యాలతో ఈ నిర్ణయానికి సరైన సహేతుక సంబంధం ఉందని భావిస్తున్నాం.
- కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందని చెప్పి నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టలేం.
- దామాషా ప్రాతిపదిక డీమోనిటైజేషన్ కసరత్తును కొట్టిపడేయలేం.
- రద్దు చేసిన నోట్ల మార్పిడికి ఇచ్చిన 52 రోజుల సమయం సరిపోదని చెప్పడం సరికాదు.
జస్టిస్ నాగరత్న ఎందుకు విభేదించారు?
- డీమోనిటైజేషన్ అనేది సదుద్దేశ్యాలతో, మంచి ఆలోచనతో చేసిన ప్రయత్నమే అయినప్పటికీ.. ఉద్దేశ్యాల ప్రాతిపదికన కాకుండా.. న్యాయపరమైన అంశాల కింద దీన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలి.
- డీమోనిటైజేషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్ బీఐ స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదు.