Sensex: కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించిన స్టాక్ మార్కెట్లు

Markets ends starts new year with profits

  • 327 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 92 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతం వరకు లాభపడ్డ టాటా స్టీల్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరాన్ని లాభాల్లో ప్రారంభించాయి. ఈ ఏడాది తొలి ట్రేడింగ్ సెషన్ లో ఇన్వెస్టర్లు పాజిటివ్ గా స్పందించారు. జీఎస్టీ వసూళ్లు పెరగడం, వాహనాల విక్రయాలు రికార్డు స్థాయికి చేరడం వంటివి ఇన్వెస్టర్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 327 పాయింట్లు లాభపడి 61,167కి చేరుకుంది. నిప్టీ 92 పాయింట్లు పెరిగి 18,197 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (5.86%), టాటా మోటార్స్ (1.73%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.35%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.09%), రిలయన్స్ (1.06%). 

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-1.47%), టైటాన్ (-1.24%), టెక్ మహీంద్రా (-0.69%), సన్ ఫార్మా (-0.36%), బజాజ్ ఫైనాన్స్ (-0.26%).

  • Loading...

More Telugu News