Uyyuru Srinivas: గుంటూరు తొక్కిసలాట ఘటన.. బెయిలుపై విడుదలైన ఉయ్యూరు శ్రీనివాస్

Uyyuru Srinivas Released On Bail in Guntur Stampede Case

  • ఘటనకు సంబంధం లేని సెక్షన్లు చేర్చారన్న న్యాయమూర్తి
  • రూ. 25 వేల సొంత పూచీకత్తుపై విడుదల
  • పోలీసుల విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశం

గుంటూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన కార్యక్రమ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాస్ బెయిలుపై విడులయ్యారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్ కోరారు. అయితే, శ్రీనివాస్‌ను రిమాండ్‌కు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో 304(2) నుంచి శ్రీనివాస్‌కు మినహాయింపు లభించింది. అనంతరం రూ. 25 వేల సొంత పూచీకత్తుపై ఆయన విడుదలయ్యారు. పోలీసు విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. 

ఆదివారం గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నగారి జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించి వెళ్లిపోయారు. అనంతరం జరిగిన పంపిణీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News