Marine Growth: నడి సంద్రంలో చిక్కుకుపోయిన నౌక.. వారం రోజులపాటు బిక్కుబిక్కుమంటూ గడిపిన వందలాదిమంది ప్రయాణికులు!

Hundreds Stranded On Cruise Ship Off Australia

  • డిసెంబరు 23న ఆక్లాండ్‌ తీరం నుంచి బయలుదేరిన నౌక
  • 9 అంతస్తులున్న నౌకలో 930 పడకలు
  • సముద్ర జలాల్లో నాచు, బయోఫౌల్ పేరుకుపోవడంతో ముందుకెళ్లేందుకు నిరాకరణ
  • అంతర్జాతీయ సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన నౌక
  • వారం రోజుల తర్వాత బయలుదేరిన ‘వైకింగ్ అరియన్’

విలాసవంతమైన న్యూ ఇయర్ విహారయాత్ర నౌక సముద్ర జలాల్లో చిక్కుకుపోవడంతో అందులోని ప్రయాణికులకు వారం రోజులపాటు భయంకరమైన అనుభవం ఎదురైంది. వైకింగ్ అరియన్ అనే నౌక డిసెంబరు 23న న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ తీరం నుంచి బయలుదేరింది. 9 అంతస్తులున్న ఈ నౌకలో 930 పడకలున్నాయి. 

మూడు రోజుల తర్వాత డిసెంబరు 26న న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్‌కు వచ్చి బయలుదేరింది. అయితే, నౌక అడుగున ముందు భాగంలో సముద్ర జలాల్లోని నాచు, చిన్న మొక్కలు, బయోఫౌల్ (సూక్ష్మజీవుల్లాంటి జీవ వృథా) పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో నౌక ప్రయాణ మార్గంలో ఉన్న మూడు రేవుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య అంతర్జాతీయ సముద్ర జలాల్లో అడిలైడ్ సమీపంలో నౌక నిలిచిపోయింది. 

హానికరమైన ఈ బయోఫౌల్‌ను తొలగించకపోతే తమ సముద్ర జలాలు విషపూరితమయ్యే ప్రమాదం ఉండడంతో దానిని శుభ్రం చేసే చర్యలు చేపట్టినట్టు ఆస్ట్రేలియా పేర్కొంది. దీంతో నౌక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో బయోఫౌల్‌ను తొలగించారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి వారం రోజులు పట్టడంతో అన్ని రోజులూ అందులోని వందలాదిమంది ప్రయాణికులు నౌకలోనే చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ గడిపారు.

  • Loading...

More Telugu News