jawan: 20 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన జవాన్.. గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన గ్రామస్థులు

Retired Army Jawan Receives Grand Welcome After Returning To Native Home in Telangana

  • కుంటుంబంతో కలిసి సైనికుడికి సన్మానం
  • బతుకమ్మ ఆటలు, బ్యాండు బాజాలతో ఆహ్వానం 
  • సంతోషంతో ఉక్కిరిబిక్కిరైన సైనికుడు

దేశ రక్షణ కోసం 20 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేసి తిరిగొచ్చిన జవానుకు సొంతూళ్లో ఘన స్వాగతం లభించింది. తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, గ్రామస్థులు కలిసికట్టుగా ఆయనను స్వాగతించారు. బాజా భజంత్రీలతో డ్యాన్సులు చేస్తూ జాతరను తలపించేలా చేశారు. నల్గొండ జిల్లా బట్టుగూడెం గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన. కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి తనను స్వాగతించడంతో లింగారెడ్డి సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.

గ్రామానికి చెందిన లక్క లింగారెడ్డి ఇరవై ఏళ్ల పాటు సైనికుడిగా సేవలందించారు. తాజాగా ఉద్యోగవిరమణ చేసి సొంతూరుకు వచ్చారు. లింగారెడ్డిని ఘనంగా స్వాగతించిన గ్రామస్థులు.. అంతా కలిసి ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ.. సైన్యంలో చేరడం సులభమే కావొచ్చు కానీ ఏళ్ల తరబడి సొంతూరుకు, కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వహించడం కష్టమేనని చెప్పారు. అయితే, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే దేశానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టమని లింగారెడ్డి వివరించారు.

  • Loading...

More Telugu News