number plate: చలానా తప్పించుకోవాలని చూస్తే.. జైలుకు వెళ్లాల్సి వస్తుంది జాగ్రత్త!

Youngster uses face mask to cover his bike number plate read what happend next

  • స్కూటీ నంబర్ ప్లేట్ కు మాస్క్ తొడిగిన యువకుడికి 8 రోజుల జైలు
  • పాతబస్తీ యువకుడిని జైలుకు పంపిన నాంపల్లి కోర్టు
  • నంబర్ దాచేందుకు ప్రయత్నించడం తీవ్రమైన నేరమంటున్న పోలీసులు

స్కూటీ నంబర్ ప్లేట్ కు మాస్క్ తొడిగి ట్రాఫిక్ సిబ్బందికి మస్కా కొట్టే ప్రయత్నం చేశాడో యువకుడు.. తనిఖీల్లో పట్టుబడ్డ యువకుడిని పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వాహనం నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేయడం తీవ్రమైన నేరమని కోర్టు వ్యాఖ్యానించింది. పాతబస్తీకి చెందిన ఆ యువకుడిని జైలుకు పంపించింది. హైదరాబాద్ పాతబస్తీలోని రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందీ ఘటన. 

నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్ పెట్టి వాహనం నడుపుతున్న సయ్యద్‌ షోయబ్ అక్తర్ అలీని రెయిన్ బజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై నాంపల్లి కోర్టులో హాజరుపరుచగా.. మెజిస్ట్రేట్ 8 రోజుల జైలు శిక్ష విధించారు. దీంతో షోయబ్ ను పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించారు. రూల్స్ ను ఉల్లంఘించే వాహనదారుల ఫొటోలు తీసి ట్రాఫిక్ సిబ్బంది, ఇంటికే చలాన్లు పంపిస్తున్నారు.

భారీ మొత్తంలో పడే ఈ జరిమానా నుంచి తప్పించుకోవడానికి కొంతమంది నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్ పెట్టడమో, నంబర్ ప్లేట్ ను కొద్దిగా వంచడమో చేస్తున్నారు. నంబర్ కనిపించకపోవడంతో చలానా పంపడం సాధ్యం కావడంలేదు. అయితే, నంబర్ ప్లేట్ కనిపించకుండా చేయడం తీవ్రమైన నేరమని పోలీసులు చెబుతున్నారు. తనిఖీలలో పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News