Vignesh Shivan: న్యూ ఇయర్ సందర్భంగా పేదలకు నయనతార-విఘ్నేశ్ బహుమతులు

Vignesh Shivan deliver gifts to underprivileged on New Year viral vedio
  • చెన్నై వీధుల్లో తిరుగుతూ పంపిణీ చేసిన నూతన దంపతులు
  • వీడియో క్లిప్ ను ట్విట్టర్లో షేర్ చేసిన నయనతార
  • వీరిద్దరు కలసి బయట కనిపించడం తక్కువే
ఇటీవలే కవలలకు తల్లిదండ్రులైన నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు, యాచకులకు కొన్ని బహుమతులు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ లను నయన తార తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.

నిజానికి వీరిద్దరూ కలసి బహిరంగంగా అంతగా కనిపించరు. కొత్త సంవత్సరం సందర్భంగా పేదలకు ఎంతో కొంత సాయం చేయాలని అనిపించేదేమో.. పేపర్ బ్యాగులో కొన్ని గిఫ్ట్స్ ఉంచి వాటిని రహదారులపై కనిపించిన అభాగ్యులకు అందించారు. చెన్నైలోని పలు రహదారుల్లో తిరుగుతూ వీటిని పంచారు. తన కోడలు నయన్ మనసు ఎంతో మంచిదని గతంలో విఘ్నేశ్ తల్లి చెప్పడం తెలిసిందే. ఇంటి పని మనిషి కష్టంలో ఉందని తెలిసి రూ.5 లక్షల సాయం చేసినట్టు చెప్పారు.
Vignesh Shivan
Nayanthara
New Year
gifts'poor people
chennai

More Telugu News