Erra Gangireddy: వివేకా హత్యకేసు... ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ

Supreme Court reserves verdict on Erra Gangireddy bail issue in Vuiveka murder case

  • వివేకా హత్యలో ఏ1 నిందితుడిగా ఎర్ర గంగిరెడ్డి
  • కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
  • సీబీఐ దర్యాప్తుకు ముందే ఎర్ర గంగిరెడ్డికి బెయిల్
  • కడప కోర్టు తీర్పును సమర్థించిన ఏపీ హైకోర్టు
  • సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. వాదనలు విన్న జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. 

వైఎస్ వివేకా 2019లో హత్యకు గురికాగా, తదనంతర కాలంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. అయితే సీబీఐ దర్యాప్తు చేపట్టకముందు ఎర్ర గంగిరెడ్డికి కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కడప కోర్టు డీఫాల్ట్ బెయిల్ ఉత్తర్వులను ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. 

ఈ నేపథ్యంలో, హైకోర్టు నిర్ణయాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ రవికుమార్ ధర్మాసనం చేపట్టింది. ఇటీవల వివేకా హత్య కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదలాయిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News