Aryan Khan: పాక్ నటితో షారుఖ్ తనయుడి ఫొటో వైరల్

Aryan Khan with Pakistan actress Sadia Khan photo went viral
  • మరోసారి వార్తల్లోకెక్కిన ఆర్యన్ ఖాన్
  • ఇటీవల నోరా ఫతేహితో డేటింగ్ అంటూ వార్తలు
  • తాజాగా సాదియా ఖాన్ తో కలిసున్న ఫొటో తెరపైకి  
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరోసారి వార్తల్లోకెక్కాడు. పాకిస్థాన్ నటి సాదియా ఖాన్ తో ఆర్యన్ కలిసున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్యన్ ఖాన్... బాలీవుడ్ నటి, డ్యాన్సర్ నోరా ఫతేహితో డేటింగ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరి ఫొటోలు ఆన్ లైన్ లో విరివిగా దర్శనమిస్తంటాయి. ఇప్పుడు పాక్ నటి సాదియా ఖాన్ తో ఆర్యన్ సన్నిహితంగా ఉన్న ఫొటో తెరపైకి వచ్చింది. దీనిపైనా సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. 

ఆర్యన్ ఖాన్ గతంలో డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడికి ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. కొంతకాలం జైలులోనూ ఉన్న ఆర్యన్ విడుదల తర్వాత భవిష్యత్ పై దృష్టి సారించాడు. సినీ రంగంలో క్రియేటివ్ విభాగంలో ఎదగాలన్న తన మనసులో మాట వెల్లడించాడు. 
Aryan Khan
Sadia Khan
Nora Fatehi
Sharukh Khan

More Telugu News