janasena: చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్

pawan kalyan meeting with chandrababu
  • హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో భేటీ
  • ఏపీలో రాజకీయాలపై ఇరువురు నేతల చర్చ!
  • వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చర్చించే అవకాశం
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలపై, జగన్ సర్కారు తాజా నిర్ణయాలపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో జనసేన అధినేత వపన్ కల్యాణ్ ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేతతో సమావేశమయ్యారు. ఇరువురు నేతల భేటీతో ఏపీ రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే అమలులోకి తీసుకొచ్చిన రోడ్ షోల రద్దు జీవోతో పాటు ఇతర ఆంక్షలపైనా చంద్రబాబుతో పవన్ చర్చించనున్నట్లు సమాచారం. చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసుల ఆంక్షలు, తదితర విషయాలు కూడా నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

గతంలో పవన్ విశాఖలో పర్యటించినపుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పుడు విజయవాడలో పవన్ కల్యాణ్ ఉన్న హోటల్ కు వెళ్లి జనసేనానికి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. మరోవైపు, ఈ నెల 12న శ్రీకాకుళంలో జనసేన నిర్వహించతలపెట్టిన యువశక్తి సభకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబుతో పవన్ చర్చించనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

janasena
Pawan Kalyan
Chandrababu
tdp
Hyderabad
pawan cbn meet

More Telugu News