Tuna: ఒక్క చేప ఖరీదు రూ.2.2 కోట్లు... ఎక్కడో చూడండి!
- జపాన్ లో బ్లూ ఫిన్ టూనా చేప వేలం
- కొనుగోలు చేసిన ఒనోడెరా గ్రూప్
- ఉత్తర అమెరికాలోని ఒమా వద్ద చిక్కిన 212 కిలోల టూనా
సముద్రంలో దొరికే చేపల్లో అత్యంత రుచికరమైన వాటిలో టూనా చేప ఒకటి. ఇది భారీ సైజులో ఉండే చేప. దీని ఖరీదు అలా ఇలా ఉండదు. దీన్ని కొనేందుకు బడా వ్యాపారులు పోటీ పడతారు.
సాధారణంగా పెద్ద టూనా చేపలను వేలం వేస్తారు. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా జపాన్ లో వేలం వేసిన ఓ టూనాకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ టూనా బరువు 212 కిలోలు కాగా, దీనికి వేలంలో రూ.2.2 కోట్ల ధర పలికింది. ఇది బ్లూ ఫిన్ రకం టూనా కావడంతో దీనికి అంత ధర పలికింది.
టోక్యో సిటీలోని టయోసు ఫిష్ మార్కెట్ లో ఈ వేలం నిర్వహించగా, జపాన్ లో సూషీ రెస్టారెంట్లు నడిపే ఒనోడెరా గ్రూప్ చేజిక్కించుకుంది. కాగా, ఈ భారీ మత్స్యరాజాన్ని ఉత్తర అమెరికాలోని ఒమా వద్ద సముద్ర జలాల్లో పట్టుకున్నారు. ఇక్కడ దొరికే బ్లూ ఫిన్ టూనాలను బ్లాక్ డైమండ్స్ అని పేర్కొంటారు. వీటికి లభించే ధర అలాంటిది మరి.