KCR: వియ్యంకుడి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్

CM KCR attends eleventh day ritual of Pakala Harinath Rao
  • ఇటీవల కన్నుమూసిన కేటీఆర్ మామ గారు
  • నేడు హైదరాబాదులో దశ దిన కర్మ
  • పాకాల హరినాథ్ రావు చిత్రపటానికి కేసీఆర్ నివాళులు
ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ మామ గారు పాకాల హరినాథ్ రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన దశ దిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. వియ్యంకుడు పాకాల హరినాథ్ రావు చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. 

ఈ సందర్భంగా తన కోడలు శైలిమ (హరినాథ్ రావు కుమార్తె)ను, ఆమె సోదరులు రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల తదితర కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాకాల హరినాథ్ రావు గత నెలలో గుండెపోటుకు గురై, గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు.
KCR
Pakala Harinath Rao
Eleventh Day Ritual
Hyderabad
KTR
BRS
Telangana

More Telugu News