Vijay: 'వారసుడు' ప్రభంజనాన్ని సృష్టించడం ఖాయం: హీరో శ్రీకాంత్
- విజయ్ హీరోగా రూపొందిన 'వారసుడు'
- ఆయనకి అన్నయ్య పాత్రను పోషించిన శ్రీకాంత్
- తమిళంలో తనకి ఇది ఫస్టు మూవీ అని వెల్లడి
- రొటీన్ కి భిన్నంగా విజయ్ చేసిన సినిమా అంటూ వ్యాఖ్య
- ఈ నెల 14న భారీస్థాయిలో విడుదల
సీనియర్ హీరోల్లో చకచకా 100 సినిమాలను పూర్తిచేసిన ఘనత శ్రీకాంత్ సొంతం. ఒక వైపున హీరోగా చేస్తూనే, మరో వైపున ముఖ్యమైన పాత్రలను కూడా చేస్తూ వెళుతున్నారు. విజయ్ 'వారసుడు' సినిమాలో ఆయనకి బ్రదర్ గా శ్రీకాంత్ నటించారు. దిల్ రాజు నిర్మాణంలో .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ .. 'వారసుడు'లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. అందువలన అన్ని ప్రాంతాలవారికి .. అన్ని భాషలవారికీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తమిళ అనువాదంలా కాకుండా, తెలుగు సినిమా మాదిరిగానే అనిపిస్తుంది. కోలీవుడ్ నుంచి ఇంతకుముందు నాకు ఆఫర్లు వచ్చినా చేయలేకపోయాను. తమిళంలో నేను చేసిన ఫస్టు సినిమా ఇదే. అదీ విజయ్ తో కలిసి చేయడం వలన మరింత ఆనందంగా ఉంది" అన్నారు.
ఈ మధ్య కాలంలో విజయ్ మాస్ యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేస్తూ వచ్చారు. రొటీన్ కి భిన్నంగా ఆయన చేసిన సినిమా ఇది. ఆర్టిస్టులంతా తెలుగు సినిమాలు చేసినవారే .. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసినవారే. అందువలన ఈ సినిమాను తెలుగులో చేసినట్టుగానే ఉంటుంది. మదర్ సెంటిమెంట్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. తమన్ పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. తప్పకుండా ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టిస్తుంది" అని చెప్పుకొచ్చారు.