Maruti Suzuki: మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. లుక్స్ అదుర్స్

Maruti Suzuki unveils eVX electric SUV at Auto Expo 2023

  • దీని పేరు ఈవీఎక్స్ ఎలక్ట్రిక్
  • ఆటో ఎక్స్ పో 2023లో ప్రదర్శన
  • 60 కిలోవాట్ బ్యాటరీతో 550 కిలోమీటర్ల రేంజ్
  • రెండేళ్లలో మార్కెట్లోకి వచ్చే అవకాశం

మారుతి సుజుకి ఒక ప్రత్యేకమైన డిజైన్ తో ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. దీన్ని ఆటో ఎక్స్ పో 2023 (వాహనాల ఎగ్జిబిషన్) కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించింది. పోటీ సంస్థలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ తదితర సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించగా.. కార్ల మార్కెట్ లో సగానికి పైగా వాటా ఉన్న దిగ్గజ సంస్థ మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ కారును తీసుకురాలేదు. 

ప్రజలు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరిగిన తర్వాత ఈ విభాగంలో మోడళ్లను తీసుకొస్తామని మారుతి సుజుకీ లోగడే ప్రకటించింది. అందులో భాగంగా తొలి ఎలక్ట్రిక్ కారును వాహనాల ఎగ్జిబిషన్ లో ఆవిష్కరించింది. ఈ కారు డిజైన్ మిగతా వాటికి భిన్నమైన లుక్స్ తో ఉండడాన్ని గమనించొచ్చు. కాకపోతే ఈ కారుకు సంబంధించి పూర్తి వివరాలను మారుతి సుజుకీ వెల్లడించలేదు. 

4,300 మిల్లీమీటర్ల పొడవు, 1,800 ఎంఎం వెడల్పు, 1,600 ఎంఎం ఎత్తుతో ఇది ఉంది. దీని పేరు ఈవీఎక్స్ ఎలక్ట్రిక్. ఈ కారులో 60 కిలోవాట్స్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఒక్కసారి చార్జ్ తో 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చు. రెండేళ్లలో ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడ్డానికి ప్రీమియం ఎస్ యూవీ మాదిరిగా ఉంది. 

  • Loading...

More Telugu News