Best US company: ఉద్యోగానికి అత్యంత అనుకూలమైన టాప్ యూఎస్ కంపెనీలు ఏవి..?

Best US company to work for revealed and its not Apple or Google
  • 4.7 రేటింగ్ తో టాప్ పెద్ద కంపెనీగా గెయిన్ సైట్ 
  • ఎనిమిదో స్థానంలో నిలిచిన గూగుల్
  • జాబితాను విడుదల చేసిన గ్లాస్ డోర్ వెబ్ సైట్
  • చిన్న కంపెనీల్లో గుడ్విన్ రిక్రూటింగ్ నంబర్1
పని చేయడానికి అత్యంత అనుకూలమైన అమెరికన్ కంపెనీలు ఏవని అనుకుంటున్నారు..? గూగుల్ లేదా యాపిల్ లేదా మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్ అనుకుంటున్నారా..? కానే కాదు. మనకు అంతగా తెలియని టెక్నాలజీ కంపెనీ గెయిన్ సైట్. మన అందరికీ తెలిసిన గూగుల్ 8వ స్థానంలో నిలిచింది. గ్లాస్ డోర్ అనే అమెరికన్ వెబ్ సైట్ 2023 సంవత్సరానికి గాను పనిచేయడానికి అనుకూలమైన టాప్ 100 యూఎస్ కంపెనీల జాబితాను విడుదల చేసింది.

ఆయా కంపెనీల్లో గతంలో పని చేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుని, వాటి ఆధారంగా కంపెనీలకు రేటింగ్, ర్యాంక్ లను గ్లాస్ డోర్ కేటాయించింది. పని చేయడానికి అత్యుత్తమమైన టాప్10 అమెరికా బడా కంపెనీల్లో.. 4.7 రేటింగ్ తో గెయిన్ సైట్ మొదటి స్థానంలో ఉంటే, ఆ తర్వాత నిలిచిన 9 కంపెనీలకూ 4.6 రేటింగ్ వచ్చింది. బాక్స్, బెయిన్ అండ్ కంపెనీ, మెకిన్సే అండ్ కంపెనీ, ఎన్విడియా, మ్యాథ్ వర్క్స్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గూగుల్, సర్వీస్ నౌ, ఇన్ ఎన్ అవుట్ బర్గర్ ఉన్నాయి. 

టాప్ 10 చిన్న అనుకూలమైన కంపెనీల్లో 4.7 రేటింగ్ తో గుడ్విన్ రిక్రూటింగ్ నిలిచింది. రెండో స్థానంలో ఉన్న టెలీమైండ్ కూడా 4.8 రేటింగ్ దక్కించుకుంది. తర్వాత జేజే టైలర్, పరివెడా, ఐరన్ క్లాడ్, క్వాలిఫైడ్, క్యాప్టివా టెల్ క్యూ, షెల్ మ్యాన్, ఈవెర్ లా, బార్బర్ నికోలస్ ఐఎన్ సీ ఉన్నాయి.
Best US company
best company
usa
Apple
Google
gainsight

More Telugu News