jobs: డిగ్రీ అర్హతతో తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు

Telangana high court invites applications for computer posts
  • కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి
  • ఈ నెల 21 నుంచి వచ్చే నెల 11 వరకు దరఖాస్తుకు అవకాశం
  • ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక
డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చూస్తున్న వారికి శుభవార్త. తెలంగాణ హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదేని విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 20 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ (నం.03/2023) విడుదల చేసింది. పూర్తి వివరాలకు http://tshc.gov.in సంప్రదించాలని నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఉద్యోగ ఖాళీల వివరాలు..
తెలంగాణ హైకోర్టులోని 20 పోస్టులు భర్తీ చేయనున్నారు.

అర్హతలు..
  • ఆర్ట్స్, సైన్స్, లా విభాగాల్లో ఏదైనా ఒకదాంట్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానమైన అర్హత..
  • టైపింగ్ లో హయ్యర్ (ఇంగ్లిష్)
  • పీజీ డిప్లొమా (కంప్యూటర్ ప్రోగ్రామింగ్ / కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బీసీఏ
  • అభ్యర్థుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో (11-01-2023 నాటికి) ఉండాలి.. ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు

దరఖాస్తు, ఎంపిక విధానం..
  • ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
  • ఎంపికైన అభ్యర్థులు ప్రారంభంలో నెలకు రూ.38,890 చొప్పున అందుకుంటారు. సీనియారిటీ పెరిగే కొద్దీ రూ.1,12,510 వరకు జీతం పెరుగుతుంది
  • దరఖాస్తుల ప్రారంభం.. 21-01-2023, గడువు తేదీ 11-02-2023
  • 20-02-2023 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు, మార్చిలో పరీక్ష నిర్వహిస్తారు.
jobs
job notification
Telangana
TS High Court
computer operator
degree jobs

More Telugu News