Ala Ninnu Cheri: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతులమీదుగా 'అలా నిన్ను చేరి' ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ విడుదల

Raghavendrarao releases Ala Ninnu Cheri first look glimpse
  • దినేష్ తేజ్ హీరోగా 'అలా నిన్ను చేరి' చిత్రం
  • హీరోయిన్లుగా హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ
  • మారేష్ శివన్ దర్శకత్వం
  • చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన రాఘవేంద్రరావు
ఇటీవల కాలంలో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు అటు యూత్ తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే బాటలో రాబోతున్న కొత్త చిత్రం ‘అలా నిన్ను చేరి’. 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

చిత్రబృందం ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతోంది. తాజాగా, సంక్రాంతి కానుకగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం రాఘవేంద్రరావు చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 
ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ వీడియోలో పాయల్, హెబ్బా పటేల్, దినేష్ తేజ్ నడుమ భావోద్వేగాలను చూడొచ్చు. హీరో దినేష్ తేజ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అతనితో హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ రొమాంటిక్ రిలేషన్ హైలైట్ చేస్తూ ఈ వీడియో కట్ చేశారు. సుభాష్ ఆనంద్ తన ఆకర్షణీయమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మెస్మరైజ్ చేశారు. 

కొత్త సంవత్సరం సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ఈ సినిమా రిలీజ్ డేట్, ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
Ala Ninnu Cheri
First Look Glimpse
Dinesh Tej
Hebah Patel
Payal Radhakrishna
Maresh Sivan

More Telugu News