Peddireddi Ramachandra Reddy: పండుగ పూట కుటుంబ సభ్యులతో గడపకుండా జగన్‌పై విమర్శలేంటి?: చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్

Peddireddy Ramachandra Reddy Slams Chandrababu Naidu
  • తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? అని పెద్దిరెడ్డి ఆగ్రహం
  • సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు చిత్తూరు జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శ
  • జగన్ కుప్పాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారన్న మంత్రి
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోమారు ఫైరయ్యారు. పండుగ పూట కుటుంబ సభ్యులతో గడపకుండా సీఎం జగన్‌పై విమర్శలేంటని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా సుదుం మండలం యర్రాతివారిపాలెంలో ఆయన మాట్లాడుతూ.. పండగపూట చంద్రబాబు కుటుంబ సభ్యులతో గడపకుండా జగన్‌పైన, తన పైన విమర్శలు చేయడం సరికాదన్నారు. 

పుంగనూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్వుతూ దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా అభివృద్దిని పట్టించుకోలేదన్న పెద్దిరెడ్డి.. జగన్ ఆధ్వర్యంలో జిల్లాతోపాటు కుప్పంలోనూ అభివృద్ధి జరుగుతోందన్నారు.
Peddireddi Ramachandra Reddy
Chandrababu
Kuppam
Jagan

More Telugu News