Tarun Chugh: ఎవరు తాలిబన్లు...?: కేసీఆర్ వ్యాఖ్యలపై తరుణ్ చుగ్ ఫైర్

Tarun Chugh reacts to KCR Taliban comments
  • భారత్ కూడా తాలిబన్ల రాజ్యమైపోతుందన్న కేసీఆర్
  • తాలిబన్లు ఎవరో అందరికీ తెలుసన్న తరుణ్ చుగ్
  • అధికారం చేజారిపోతోందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నాడని వెల్లడి
ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీని విమర్శిస్తూ.... కేంద్రం పాలన ఇలాగే కొనసాగితే భారత్ కూడా ఆఫ్ఘనిస్థాన్ లా తాలిబన్ల రాజ్యంగా మారిపోతుందని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ తీవ్రస్థాయిలో స్పందించారు. తాలిబన్లు ఎవరో అందరికీ తెలుసన్నారు. 

"ప్రభుత్వ వాహనంలో ఓ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినవాళ్లే తాలిబన్లు... ఈ అత్యాచార ఘటనలో ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నేతలే తాలిబన్లు... అత్యాచారం చోటుచేసుకున్న వాహనాన్ని నడిపిన అధికార పార్టీ నేతల పిల్లలే తాలిబన్లు... దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయనివాళ్లే తాలిబన్లు... డబుల్ బెడ్రూం ఇళ్లను ఇవ్వనివాళ్లే తాలిబన్లు... పేదల రక్తం పీల్చుకునేవాళ్లే తాలిబన్లు..." అంటూ ధ్వజమెత్తారు. 

తెలంగాణలో అధికారం కోల్పోతామన్న ఆందోళన కేసీఆర్ లో కనిపిస్తోందని తరుణ్ చుగ్ విమర్శించారు.
Tarun Chugh
KCR
Taliban
Afghanistan
BJP
BRS
Telangana
India

More Telugu News