Chandrababu: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

Chandrababu and family members celebrates Sankranti in Naravaraipalle
  • సంక్రాంతి పండుగకు నారావారిపల్లె విచ్చేసిన చంద్రబాబు
  • బాలయ్య కుటుంబం కూడా అక్కడే మకాం
  • గంగమ్మ కట్ట, నాగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
  • తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పించిన చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని గంగమ్మ కట్ట, నాగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పించారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

ఈ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, నారా లోకేశ్, నారా బ్రాహ్మణి, బాలకృష్ణ, వసుంధర, మోక్షజ్ఞ తదితరులు సంక్రాంతి సంబరాల్లో సందడి చేశారు.
Chandrababu
Naravaripalle
Sankranti
Nara
Nandamuri

More Telugu News