Pawan Kalyan: బాలకృష్ణ, పవన్ అన్ స్టాపబుల్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.. నంబర్ 1 ట్రెండింగ్ లో వీడియో

Balakrishna and pawan kalyan unstopable eposode glimps trending no1
  • సంక్రాంతి సందర్భంగా చిన్న ప్రోమో విడుదల
  • ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ పూర్తి 
  • ఎడిసోడ్ స్ట్రీమింగ్ తేదీని ఇంకా ప్రకటించని ఆహా
ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ, విదేశాల్లో సందడి చేస్తోంది. షోలో బాలకృష్ణ అతిథులను ఇంటర్వ్యూ చేసే తీరు, సరదా సంభాషణలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ మధ్యే ప్రభాస్ తో నిర్వహించిన షో ఫుల్ హిట్ అయ్యింది. గోపీచంద్ కూడా హాజరవడంతో రెండు ఎడిసోడ్స్ పాటు దీన్ని టెలీకాస్ట్ చేశారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో బాలయ్య షో కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ పూర్తయినప్పటికీ బాలయ్య, పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ గురించి ఆహా యాజమాన్యం ఇంకా ప్రకటన చేయలేదు. 

అయితే, సంక్రాంతి సందర్భంగా ఈ షో గ్లింప్స్ ను విడుదల చేశారు. చిన్న ప్రోమో అయినప్పటికీ హైప్ ఏర్పడింది. అన్నపూర్ణ స్టూడియోలో ఇద్దరు హీరోలకు సంబంధించి భారీ కటౌట్లు ఏర్పాట్లు చేశారు. బాలకృష్ణ, పవన్ లగ్జరీ కార్లలో స్టూడియోకి రాగానే అభిమానులు వారిపై పూల వర్షం కురిపించారు. సెట్ లోపలికి చేరుకోగానే పవన్ చేతిని పేకెత్తి అభివాదం చేశారు బాలకృష్ణ. ఆ వెంటనే ముందు నేను ఈయన మెజర్మెంట్స్ తీసుకోవాలి అని అనగానే పవన్ గట్టిగా నవ్వడంతో ప్రోమో ముగిసింది. గ్లింప్స్ లో ఇద్దరి మధ్య పెద్దగా సంభాషణ లేకపోయినప్పటికీ యూ ట్యూబ్ లో ఈ గ్లింప్స్ హల్ చల్ చేస్తోంది. విడుదలై ఓ రోజు అయినప్పటికీ నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. యూట్యూబ్ లో ఇప్పటికకే 2.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. కాగా, ఈ ఎడిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందనే విషయంపై ఆహా నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
Pawan Kalyan
Balakrishna
aha
unstopable
episode

More Telugu News