BRS: 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. ఖమ్మం బీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు

High arragements for Khammam BRS Sabha

  • ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ సభ
  • ఇప్పటికే గులాబీమయమైన ఖమ్మం
  • 3 లక్షల మంది సభకు హాజరయ్యే అవకాశం

ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగబోతోంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఇది. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సభకు ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మం నగరం పార్టీ హోర్డింగులు, కటౌట్లతో గులాబీమయమయింది. తొలి సభ కావడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 15 వేల మంది వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వారికి కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేసేలా డ్రైవర్లకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. వీఐపీల కోసం సభా వేదిక ముందు 20 వేల కుర్చీలను ఏర్పాటు చేయనున్నారు. 3 లక్షల మంది పార్టీ కార్యకర్తలు సభకు హాజరుకాబోతున్నారు.

  • Loading...

More Telugu News