Mahesh Babu: మహేశ్ మూవీ కోసం శోభనను రప్పిస్తున్న త్రివిక్రమ్!

Mahesh and Trivikram movie update
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ మూవీ
  • రేపటి నుంచి రెగ్యులర్ షూటింగు మొదలు 
  • కథానాయికగా పూజ హెగ్డే ఖరారు 
  • మరో హీరోయిన్ గా తెరపైకి శ్రీలీల పేరు
త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్లో 3వ సినిమా రూపొందనుందన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రేపటి నుంచి ఈ సినిమా పట్టాలెక్కుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన ప్రధానమైన కథానాయికగా పూజ హెగ్డే, సెకండ్ హీరోయిన్ స్థానంలో శ్రీలీల కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక సాధారణంగా తన సినిమాల్లో కీలకమైన మహిళ పాత్రలను సీనియర్ స్టార్ హీరోయిన్స్ తో త్రివిక్రమ్ చేయిస్తుంటాడు. అలా ఈ సారి ఆయన శోభనను రప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

హీరోయిన్ గా తెలుగులో శోభనకి మంచి హిట్లు ఉన్నాయి. 2006లో వచ్చిన 'గేమ్' తరువాత ఆమె మళ్లీ తెరపై కనిపించలేదు. అలాంటి శోభనను ఒప్పించే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడని అంటున్నారు. చాలా కాలంగా నటనకు దూరంగా ఉంటూ వస్తున్న శోభన ఒప్పుకుంటుందా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Mahesh Babu
Trivikram Srinivas
Sobhana

More Telugu News