Rafael Nadal: స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం నాదల్ కు అతి పెద్ద షాక్​!

Defending Champion Rafael Nadal Out Of Australian Open Loses In Straight Sets In Second Round
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ లోనే ఓటమి
  • డిఫెండింగ్ చాంపియన్ కు షాకిచ్చిన 65వ ర్యాంకర మెకెంజీ
  • వరుస సెట్లలో ఓడి నిరాశతో ఇంటిదారి పట్టిన నాదల్
ఈ సీజన్ మొదటి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పెద్ద సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కు చుక్కెదురైంది. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన నాదల్ రెండో రౌండ్ లో ఇంటిదారి పట్టాడు. బుధవారం ఉదయం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో అమెరికాకు చెందిన మెకెంజీ మెక్ డొనాల్డ్ 6–4, 6–4, 7–5తో వరుస సెట్లలో నాదల్ కు షాకిచ్చి మూడో రౌండ్ చేరుకున్నాడు. 65వ ర్యాంకర్ తో మ్యాచ్ లో నాదల్ తీవ్రంగా నిరాశ పరిచాడు.

 ఆరంభం నుంచే కోర్టులో ఇబ్బందిగా కదిలాడు. తుంటి గాయంతో ఇబ్బంది పడ్డ నాదల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మధ్యలో మెడికల్ టైమ్ ఔట్ తీసుకున్నప్పటికీ లయ అందుకోలేకపోయాడు. దాంతో, తీవ్ర నిరాశతో టోర్నీ నుంచి వైదొలిగాడు. నాదల్ ఓటమిని తట్టుకోలేకపోయిన అతని భార్య మరియా పెరెలో కన్నీళ్లు పెట్టుకుంది. మ్యాచ్ తర్వాత మాట్లాడిన నాదల్ తాను మానసికంగా ఇబ్బందికి గురయ్యానని చెప్పాడు. తన కెరీర్ గురించి తదుపరి నిర్ణయం తీసుకునే వయసు తనకుందని వ్యాఖ్యానించాడు.
Rafael Nadal
Australian Open
out
second round

More Telugu News