Mumbai Marathon: 80 ఏళ్ల వయసులో అలుపు సొలుపూ లేకుండా పరుగెత్తిన బామ్మ!

80 year old woman who ran Mumbai Marathon in saree is an inspiration for people

  • టాటా ముంబై మారథాన్ కార్యక్రమంలో భాగస్వామ్యం
  • 51 నిమిషాల్లో 4.2 కిలోమీటర్ల దూరం పాటు పరుగు
  • యువతరానికి స్ఫూర్తినీయం అంటూ కామెంట్లు

80 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండేంత అదృష్టం అతి కొద్ది మందికేనని చెప్పొచ్చు. అలాంటి వయసులో ఓ బామ్మగారు ఏకంగా పరుగు పందెంలో హుషారుగా పాల్గొనడం సాధారణ విషయం కాదు. 18వ ఎడిషన్ టాటా ముంబై మారథాన్ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. ముంబై వాసులు ఈ పరుగులో పాల్గొనగా.. చీర కట్టుకుని, కాళ్లకు షూ ధరించిన ఓ బామ్మగారు కూడా వారితో కలసి పరుగు అందుకున్నారు. ఆమెను చూసిన చాలా మంది ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. 

ఆమె పేరు భారతి. ఆమె మనవరాలు డింపుల్ మెహతా ఫెర్నాండెజ్ ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. యువతరానికి బామ్మగారు మంచి స్ఫూర్తినీయం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. 18వ ఎడిషన్ టాటా ముంబై మారథాన్ కార్యక్రమంలో 55 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. అందరిలోకీ భారతి అనే ఈ బామ్మగారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పరుగెత్తే సమయంలో చేతితో త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్నారు. 4.2 కిలోమీటర్ల దూరాన్ని 51 నిమిషాల్లో చేరుకున్నారు. పెద్ద వయసు కావడంతో మధ్య మధ్యలో నడుస్తూ, పరుగెత్తుతూ గమ్యం చేరుకున్నారు. మారథాన్ లో బామ్మగారు పాల్గొనడం ఇది ఐదోసారి. (ఇన్ స్టా వీడియో కోసం)

  • Loading...

More Telugu News