Volodymir Zelensky: పుతిన్ బతికున్నాడో లేదో అనుమానమే!: జెలెన్ స్కీ

Russia condemns Zelensky remarks on Putin

  • ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న జెలెన్ స్కీ
  • శాంతిచర్చలపై జెలెన్ స్కీని ప్రశ్నించిన మీడియా
  • ఎవరితో చర్చించాలో అర్థంకావడంలేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
  • పుతిన్ ఎప్పుడో ఒకసారి టీవీ తెరపై కనిపిస్తుంటాడని వ్యాఖ్యలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంకా బతికున్నాడో లేదో తనకైతే అనుమానమేనని అన్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జెలెన్ స్కీ కూడా పాల్గొన్నారు. 

తన ప్రసంగంలో ఆయన మాట్లాడుతుండగా, రష్యాతో శాంతిచర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయని మీడియా ప్రశ్నించింది. అందుకు జెలెన్ స్కీ బదులిస్తూ... ఎవరితో ఏం మాట్లాడాలో అర్థంకావడంలేదని అన్నారు. అసలు, రష్యా అధ్యక్షుడు సజీవంగా ఉన్నాడో? లేదో? అంటూ సందేహం వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు టీవీలో కనిపిస్తుండడం తప్ప, ఆయన బతికుండి, నిర్ణయాలు తీసుకుంటున్నాడా? అనేది తాను చెప్పలేనని జెలెన్ స్కీ అన్నారు. 

జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే రష్యా అధ్యక్ష కార్యాలయం స్పందించింది. రష్యా ఓ దేశంగా కొనసాగడం కానీ, పుతిన్ బతికుండడం గానీ ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఏమాత్రం ఇష్టంలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ కు, జెలెన్ స్కీకి రష్యా, పుతిన్ పెను సమస్యగా ఉన్నారన్నది స్పష్టమైందని రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ పేర్కొన్నారు. రష్యాకు ఏమీ కాదని, రష్యా ఇకముందూ ఉంటుందని జెలెన్ స్కీకి త్వరలోనే అర్థమవుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News