Pawan Kalyan: పవన్ తో బాలయ్య అన్ స్టాపబుల్-2... తాజా టీజర్ ఇదిగో!

Balakrishna Unstoppable 2 episode with Pawan Kalyan Teaser released
  • బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్-2
  • పవన్ తో ఎపిసోడ్ ఇటీవల చిత్రీకరణ
  • ప్రోమో విడుదల చేసిన ఆహా ఓటీటీ
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో తొలి సీజన్ ను మించి రెండో సీజన్ దూసుకుపోతోంది. సినీ, రాజకీయ ప్రముఖులను ఇంటర్వ్యూకు పిలుస్తూ, వారిని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తూ బాలయ్య ఈ టాక్ షోను రక్తికట్టిస్తున్నారు. ఆహా ఓటీటీ వేదికపై ఈ టాక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

తాజాగా, జనసేనాని, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా అన్ స్టాపబుల్-2 కార్యక్రమానికి హాజరు కాగా, దానికి సంబంధించిన ఎపిసోడ్ ను కూడా చిత్రీకరించారు. ఈ మేరకు ఆహా వీడియో టీజర్ వీడియోను విడుదల చేసింది. పవన్ ను తనదైన శైలిలో బాలయ్య పలు ప్రశ్నలు అడగడం ఈ వీడియోలో చూడొచ్చు. 

తన అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్నవి ఏంటి, వద్దనుకున్నవి ఏంటి? అంటూ పవన్ ను బాలయ్య ప్రశ్నించారు. అంతేకాదు, రాష్ట్రంలో దాదాపు ప్రతి ఒక్కరూ పవన్ ఫ్యానే అని, కానీ ఆ అభిమానం ఓట్ల రూపంలోకి ఎందుకు మారలేదని సూటిగా అడిగారు. ఇలాంటివే అనేక ప్రశ్నల సమాహారం ఈ ఎపిసోడ్ అని టీజర్ చూస్తే తెలుస్తోంది.
Pawan Kalyan
Balakrishna
Unstoppable-2
Teaser
Aha

More Telugu News